ఆర్మీలో చేరాలనుకునే వారు.. ప్రతి పక్షాల మాటలు నమ్మొద్దని దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు పేర్కొన్నారు. నల్లగొండ పట్టణంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా బీజేపీ శక్తి కేంద్రాల ఇంచార్జీల మరియు కార్యవర్గ సమావేశం నిర్వహించారు రఘనందన్ రావు. ఈ సందర్భంగా రఘనందన్ రావు మాట్లాడుతూ.. గత రెండు మూడు రోజులుగా భారత ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ప్రతిపక్షాలు ఈ రాష్ట్ర పాలక పక్షం ప్రవర్తించిన తీరు బాధకారమని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ల పర్యటన లలో ప్రతిపక్ష నేతలను వెంటాడి అరెస్టులు చేసిన పోలీసులు.. రైల్వే స్టేషనలో రోజంతా విద్వంసం చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారని నిలదీశారు. చనిపోయిన వ్యక్తి మీ టీఆర్ఏస్ సొత్తా.. వేరే పార్టీ వాళ్ళు రాకూడదా అని నిలదీశారు. అధికార పార్టీ డబ్బులిచ్చి కావాలని చేయించిందే ఈ ఘటన అని.. ఈ దేశానికి సేవ చేయాలినుకునే అభ్యర్డులు ఇతరుల మాట విని మీరు తప్పు దోవపట్టకండని మండిపడ్డారు.
ఎంతోమంది మేధావుల ఆలోచనలు, సమీక్షల తరువాతే తీసుకొచ్చిన పథకం అగ్నిపత్ అని.. ప్రతిపక్షాలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా మిలిటరీ మారుతూ ఉంటుంది.. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుంటుందని… జులై 2, 3 న హైదరాబాద్ లో జరిగే ప్రధాని సభ కు జిల్లాకు లక్షమంది చొప్పున తరలించడానికి జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు.