Yoga Day: యోగా-ధ్యానం రెండు ఒకటేనా.. ఏది బెస్ట్..?

-

చాలా మందికి యోగా, -ధ్యానం రెండు ఒకటే అనే భావనతో ఉంటారు..మరి కొంతమందికి వ్యాయామాలు చేయడం మేలు అనే ఫీలింగ్ లో ఉంటారు. యోగా, ధ్యానం మధ్య చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ, రెండు కూడా ఒకటే అని వారు భావిస్తుంటారు.. నిజానికి ఈ రెండింటికీ శ్వాస తో సంబంధం ఉంటుంది.వాటి ప్రయోజనాలు, వాటి పద్దతులు భిన్నంగా ఉంటాయి. యోగా, ధ్యానం మధ్య తేడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సాదారణంగా యోగాలోనే ధ్యానం ఒక భాగం. యోగా, ధ్యానం మధ్య అతిపెద్ద వ్యత్యాసం శరీరం కదలిక. యోగా సమయంలో వివిధ భంగిమల కారణంగా శరీరంలో కదలిక ఉంటుంది. అయితే ధ్యానంలో ఇది జరగదు. ధ్యానం చేయడం ద్వారా మానవులు తమ శక్తి ద్వారా ఒక నిర్దిష్టమైన ధ్వని లేదా శ్వాసపై దృష్టి పెడతారు.

యోగా చేసిన తర్వాత ధ్యానం చేయడం ఎల్లప్పుడూ మంచిది. యోగా తర్వాత శరీరంలో ఓ రకమైన వైబ్రేషన్ ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ధ్యానం చేయడం మంచిది. ఈ విధంగా ధ్యానం అనేది యోగా తర్వాత సాధన.

ధ్యానం ఎలా పనిచేస్తుందో చుద్దాము… ఒక వ్యక్తి మనస్సు అనేక విధాలుగా ఆలోచిస్తుంది. దాని కారణంగా అతని మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఆ శాంతిని తిరిగి పొందాలంటే ధ్యానం చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ఉదయం 4-5 గంటల సమయంలో చెయ్యడం చాలా మంచిది.

ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది చాలా వరకు నిద్రలేమి సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తుంది..ఇంకా ఎన్నో మానసిక రుగ్మతలను దూరం చేస్తుంది..ఈ రెండు చాలా అవసరమైనవి వీటిని తప్పక చేయడం మంచి ఫలితాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news