తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగానే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కోరే అవకాశం ఉందని, పడిపోతున్న పార్టీ గ్రాఫ్ ను చూసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.
తెలుగువారి ఆరాధ్య దైవమైన ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 41 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను ఆ పార్టీ శ్రేణులకు రఘురామకృష్ణ రాజు గారు తెలియజేశారు. తెలుగుజాతి గౌరవాన్ని ఇనుమడింపజేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారని, పార్లమెంటులో ఎన్టీ రామారావు గారి చిత్రపటానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు పూలమాల వేసి నివాళులు అర్పించడం నిజమైన రాజకీయాలకు నిదర్శనం అని అన్నారు. ఈ బంధం మరింత బలపడి ప్రజలకు అండదండలు అందించాలని కోరారు.