పుట్టిన రోజు వేడుకలు వద్దు : రాహుల్‌ గాంధీ..

-

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ పుట్టిన రోజు నేడు. అయితే.. దేశంలోని ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలకు రాహుల్ గాంధీ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే.. తన పుట్టినరోజు వేడుకలు జరుపొద్దని కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలను రాహుల్ గాంధీ కోరారు. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై మేమంతా ఆందోళన చెందుతున్నామని రాహుల్ గాంధీ వెల్లడించారు. కోట్లాది యువకుల మనసు బాధగా ఉందని, యువత, కోట్లాది కుటుంబాల బాధను పంచుకుందాం, వారికి అండగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్రిపథ్‌ స్కీంను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ సత్యాగ్రహ దీక్షకు పూనుకుంది.

Rahul Gandhi Channels His Inner Messi to Lead 2019 Coalition, But Oppn May  Not Play Ball

ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులకు సత్యగ్రహ దీక్ష విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది కాంగ్రెస్‌. ఈ సందర్భంగానే నేడు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కూడా తెలంగాణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సత్యాగ్రహ దీక్షను చేపట్టనున్నారు. ఈ సత్యాగ్రహ దీక్ష కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు భారీ పాల్గొనాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నిన్న పిలుపునిచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news