రాహుల్ గాంధీ కోహ్లీలా మంచి ఫామ్ లో ఉన్నాడు: సంజయ్ రౌత్

-

కొన్ని రోజుల క్రితం రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. అయినప్పటికి ప్రజల్లోకి చొచ్చుకుపోతూ పార్టీని అభివృద్ధి చేయడానికి తీవ్రంగా కృషిచేస్తున్నాడు. తాజాగా రాహుల్ గాంధీ గురించి శివసేన నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈయన తాజాగా చేసిన వ్యాఖ్యలలో… రాహుల్ గాంధీకి ఎంపీ సభ్యత్వం కోల్పోయినా.. ఢీలా పడిపోకుండా చాలా ఉత్సాహంగా ప్రజల్లో తిరుగుతున్నారంటూ పొగిడారు. ఇంకా మాట్లాడుతూ ఈయన మాట్లాడే సభలకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ మీటింగ్ లో మాట్లాడే మాటలకు అందరూ ఎంతగానో ప్రభావితం అవుతున్నారని అభిప్రాయపడ్డారు.

 

 

 

ఒక క్రికెటర్ సచిన్ మరియు కోహ్లీలు ఎలా ఫామ్ లో ఉంటారో.. ఇపుడు రాజకీయాలలో రాహుల్ గాంధీ ఫామ్ లో ఉన్నారని మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news