భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి వైఎస్సార్ పాదయాత్ర : రాహుల్ గాంధీ

-

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని వైఎస్‌ఆర్‌ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. తల్లి విజయమ్మ, సతీమణి భారతి ఆయన వెంట ఉన్నారు. వైఎస్‌ఆర్‌ ఘాట్ వద్ద ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నివాళి అర్పించారు. జగన్ వెళ్లిన అరగంట తర్వాత ఆమె వైఎస్‌ఆర్‌ ఘాట్‌కు వచ్చారు.

మరోవైపు వైఎస్సార్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. వైఎస్సార్ ప్రజా నేత అని కొనియాడారు. ఏపీ ప్రజల కోసం ఆయన ఎంతో సేవ చేశారని అన్నారు. ఇవాళ ఆయన బతికుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో బాగుండేదని పేర్కొన్నారు. ఆయన ఉండి ఉంటే ఏపీ ప్రజలు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, బాధలు ఎదుర్కోకపోయే వారని తెలిపారు. ఆయన పాలనలో రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారని గుర్తు చేశారు.

‘వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల.. ఆయన లెగసీని కొనసాగిస్తారు. తన తండ్రిలాగే ఏపీ ప్రజలంటే ఆమెకు అభిమానం, ప్రేమ ఉన్నాయి. వైఎస్సార్ నుంచి నేను వ్యక్తిగతంగా చాలా నేర్చుకున్నాను. నేను చేపట్టిన భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి ఏపీలో వైఎస్సార్ చేసిన పాదయాత్ర. ఆయన యాత్ర నుంచి చాలా విషయాలు నేర్చుకుని భారత్ జోడో యాత్రలో ఉపయోగించాం. వైఎస్సార్ జయంతి రోజున ఆయణ్ను మరోసారి స్మరించుకుందాం, అని రాహుల్ గాంధీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news