తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలుల వీస్తాయన్నారు. అలాగే అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయన్నారు.

కాగా, ఈ నెల 29న తేదీన కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మంగళవారం కేరళతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. కాగా, మరో రెండు మూడు రోజుల్లో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు, కొంకన్, గోవాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఉత్తర పరిమితి కార్వార్, చిన్నమగళూరు, బెంగళూరు, ధర్మపురి మీదుగా వెళ్తున్నాయని తెలిపారు.