హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. అయితే.. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లింగంపల్లి, ఆశోక్ నగర్, మియాపూర్, బాలానగర్, నేరేడ్ మెట్, దిల్ సుఖ్ నగర్, ఎల్ బీ నగర్, ఖైరతాబాద్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది.
ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. డ్యూటీలు ముగించుకొని ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా నగరంలోని రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్ జామ్ అయింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు కూడ వెదర్ డిపార్ట్మెంట్ ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. అయితే, నగరంలో భారీ వర్షంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది.
లోతట్టు ప్రాంతాలకు ఇప్పటికే సిబ్బంది చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆఫీసులు అయిపోయే టైం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉండడంతో.. నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ట్రాఫిక్ సిబ్బంది ఇప్పటికే అలర్ట్ కాగా.. చాలా చోట్ల ఇప్పటికే స్లోగా ట్రాఫిక్ ముందుకు కొనసాగుతోంది. అయితే, గత సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కాగా.. గత రెండు రోజులుగా కొద్దిగా ఆకాశం మబ్బులు పట్టిన వర్షం మాత్రం కురవలేదు.