తెలుగులో ఆ సత్తా ఉన్న ఏకైక హీరో శ్రీ విష్ణు..రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

RRR సినిమాతో తెలుగు చిత్ర సీమ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన దర్శకులు రాజమౌళి..తాజాగా ఓ టాలీవుడ్ యంగ్ హీరో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ హీరో ఎవరంటే.. శ్రీవిష్ణు. విలక్షణమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో.

‘బాణం’ ఫేమ్ దర్శకులు చైతన్య దంతలూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘భళా తందనానా’ చిత్రంలో శ్రీవిష్ణు హీరోగా నటించారు. హీరోయిన్ గా కేథరిన్ థెరిసా నటించింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మూవీ గురించి, హీరో శ్రీవిష్ణు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తెలుగు చిత్ర సీమలో ఉన్న హీరోల్లో ఎవరికి లేని లక్షణం శ్రీ విష్ణుకు ఉందని చెప్పారు. శ్రీవిష్ణు అతి తక్కువ టైంలోనే మాస్ హీరోగా మారిపోతారని చెప్పారు. యంగ్ హీరోల్లో శ్రీవిష్ణుకు చక్కటి భవిష్యత్తు ఉందని అన్నారు. ‘భళా తందానానా’ స్టోరి గురించి తనకు సాయి కొర్రపాటి చెప్పారని, డిఫరెంట్ స్టోరి అని, రైటింగ్ చాలా బాగుందని పేర్కొన్నారు.

ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. హీరోయిన్ కేథరిన్ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా చాలా బాగా యాక్ట్ చేసిందని పొగిడారు. ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా హాజరయ్యారు. శ్రీ విష్ణు తన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్ర పోషించినప్పటికీ చాలా క్వశ్చన్స్ అడిగారని గుర్తు చేసుకున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news