ఈ నెల‌లో `ఆర్ఆర్ఆర్` నుంచి రాజ‌మౌళి సర్ ప్రైజ్ గిఫ్ట్‌.. ఏంటో తెలుసా..?

-

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తుంది. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వ‌ర‌కు ఎలాంటి అప్ డేట్లు బయటికి రాకుండా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారికంగా ఎన్టీఆర్ – చరణ్ ఫస్టులుక్ పోస్టర్స్ కూడా రాలేదు.

ఈ విషయం అభిమానులను నిరాశకి గురిచేస్తుందని భావించిన రాజమౌళి, ఈ సినిమా నుంచి ఒక ప్రత్యేకమైన వీడియోను వదిలే పనిలో వున్నారని అంటున్నారు. ఆ వీడియోకి సంబంధించిన షాట్స్ ను రాజమౌళి తనయుడు కట్ చేస్తుండగా, కీరవాణి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారట. ఎన్టీఆర్ – చరణ్ లుక్స్ ను రివీల్ చేస్తారో లేదో తెలియదుగానీ, ఇంట్రెస్టింగ్ విజువల్స్ తోనే ఈ వీడియోను విడుదల చేస్తారట. ఈ నెల 14న గానీ .. 21న గాని ఈ వీడియోను విడుదల చేయవచ్చని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news