రజనీ కాంత్ సినిమా మళ్లీ ప్లాపేనా..!!

-

సూపర్ స్టార్ రజనీ కాంత్ క్రేజ్ గురించి దేశమంతా తెలుసు. ఈ వయస్సు లో కూడా తాను ఎంతో ఎనర్జీ తో సినిమాలలో నటిస్తూ వున్నారు. గతంలో తన సినిమాలు ఫాన్ ఇండియా లెవల్లో వసూళ్ల వర్షం కురిపించాయి. తన సినిమా కోసం ఇప్పటికీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తు వుంటారు. ప్రస్తుతం రజనీ కాంత్ రెండు సినిమాలు ఒప్పుకున్నారు.

ఈ రెండు సినిమాలు లైకా ప్రొడక్షన్స్ వారే . ఈ సంస్థ నిర్మించే ఈ రెండు సినిమాలకు దర్శకులు ఎవరనే దానిపై రకరాల ప్రచారం జరుగుతోంది . కోలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం అందులో ఒక చిత్రానికి ‘డాన్’ సినిమా తీసిన శిబి చక్రవర్తి ని డైరెక్టర్ గా ఎంచుకున్నారట. మరో సినిమాకు రజనీ కాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తున్నాయి

ఈ సినిమా రజనీ కాంత్ 170 సినిమా గా వుండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ న్యూస్ విన్న రజనీ అభిమానులు గతంలో చిన్న కుమార్తె  సౌందర్య తీసిన కొచ్చాడియాన్ సినిమాని గుర్తు చేసుకొని కంగారు పడుతున్నారట. గతంలో ఈ సినిమా పై సూపర్ హైప్ క్రియేట్ అయ్యి తీరా థియేటర్ లో వెళ్ళి చూసే సరికి అది టీవీ ఛానెల్ లో వచ్చే యానిమేషన్ సినిమాలా ఉండే సరికి సినిమా దారుణంగా ప్లాప్ అయ్యింది. రజనీ ఇమేజ్ డామేజ్ అయ్యింది. ఈ కూతురు కూడా అలాగే చేస్తుందని ప్యాన్స్ భయపడుతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news