బంగారం ప్రియులకు ఇవాళ కూడా గుడ్ న్యూస్.. వెండి కొనుగోలుదారులకు మాత్రం షాక్ !

న్యూఢిల్లీ: బంగారం ప్రియులకు వరుసగా గుడ్ న్యూస్. నిన్న భారీగా తగ్గిన బంగారం ఇవాళ కూడా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 380 తగ్గగా 22 క్యారెట్ల బంగారంపై రూ. 350 తగ్గింది. దీంతో ఈ రోజు బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 44,550 కాగా 24 క్యారెట్ల బంగారం రూ. 48,600గా ఉంది.

గోల్డ్
గోల్డ్

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 50,950 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 45,700గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,900 ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ. 46,900గా కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ. 48,600కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 44,550గా విక్రయాలు జరుగుతున్నాయి. విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి.

ఇక వెండి విషయానికొస్తే వరుసగా రెండు రోజు కూడా షాక్ ఇచ్చింది. నిన్న కేజీ వెండి రూ. 71,500 ఉండగా ఈ రోజు రూ. 400 పెరిగింది. దీంతో కిలో వెండి రూ. 71,900కు చేరుకుంది.

వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవే..