పెళ్లి పిలుపు : పవన్‌కు నితిన్ స్పెషల్ ఇన్విటేషన్..!

-

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా గత కొన్నాళ్లుగా నితిన్ వివాహం వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఎట్టకేలకు ప్రభుత్వ నియమాలు, నిబంధనలతో అతి తక్కువ మంది బంధువుల మధ్య వివాహం చేసుకోటానికి సిద్ధం అయ్యాడు నితిన్. దీంతో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కొద్దిమంది సమక్షంలో ఈ నెల 26న నితిన్ వివాహం జరగబోతోంది. అయితే తన పెళ్లికి హాజరు కావాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఇటీవల ఆహ్వానించిన నితిన్ అలాగే తన అభిమాన నటుడు పవన్‌ కళ్యాణ్‌ను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించాడు.

పవన్‌తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, మెగా హీరో వరుణ్ తేజ్‌లకు కూడా ఇన్విటేషన్ అందిందట. నితిన్ చదవుకునే రోజుల నుంచే పవన్ కళ్యాణ్ ను పిచ్చి పిచ్చిగా అభిమానిస్తుండేవాడు. అప్పట్లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ సినిమా దాదాపుగా వంద సార్లు చూశానని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నితిన్ పెళ్ళికి పవన్ కళ్యాణ్ వచ్చి ఆశీర్వధిస్తాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news