కల్వకుంట్ల కవితకు రాజ్యసభ టికెట్ ?

-

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… చక్రం తిప్పుతున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముదిరాజు సామాజికవర్గానికి చెందిన.. రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ కు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు సీఎం కేసీఆర్.

ఎమ్మెల్సీ ఇవ్వటమే కాకుండా.. తెలంగాణ కేబినెట్లోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే బండ ప్రకాష్ రాజ్యసభ స్థానం లో.. తన కూతురు కల్వకుంట్ల కవిత ను రాజ్యసభ కు పంపే యోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగానే.. బండ ప్రకాష్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు సమాచారం అందుతోంది. జనవరి 4 వ తేదీన కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవి ముగియ నుంది. ఆ తర్వాత రాజ్యసభకు కవిత వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె మొదటి నుంచి ఎమ్మెల్సీ పదవి పై అసంతృప్తిగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news