ప్రకాశ్‌రాజ్‌ కు రాజ్యసభ టికెట్… కేసీఆర్ బంపర్ ఆఫర్..!

-

టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. టిఆర్ఎస్ పార్టీ తరఫున నటుడు ప్రకాష్ రాజ్ ను రాజ్యసభకు పంపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జాతీయ రాజకీయాల్లో ప్రకాష్ రాజు కు గులాబీ బాస్ కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దక్షిణాదితో పాటు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ప్రకాష్ రాజ్… తెలుగు రాష్ట్రాలతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక అలాగే తమిళనాడులోనూ ప్రకాష్ రాజ్ కు విపరీతంగా అభిమానులు ఉన్నారు. దీనికితోడు బీజేపీ వ్యతిరేక భావజాలంతో దేశవ్యాప్తంగా ప్రకాష్ రాజ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఈ నేపథ్యంలోనే ప్రకాష్రాజు టిఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభకు పంపే సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం ఉంటుంది. త్వరలో తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఒక స్థానం ప్రకాష్ రాజు అవకాశం కల్పిస్తే జాతీయ స్థాయిలో బీజేపీ వైఖరిని ఎండగట్టెందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా విలువైన సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news