ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 11 రోజుల పాటు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి కూడా శివ భక్తులు లక్షల్లో రానున్నారు. దీనికి శ్రీశైలం బోర్డు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు వసతి, పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
అలాగే దర్శనానికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా.. ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం.. అధికారులు ప్రత్యేకంగా.. ఆన్ లైన్ టికెట్లను ఏర్పాటు చేశారు. భక్తులు టికెట్ల విషయం ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండటానికి.. ఇప్పటికే ఆన్ లైన్ లో టికెట్లను విడుదల చేశారు. అతి శీఘ్ర దర్శనం టికెట్ ధర రూ. 500 ఉంది. అలాగే శీఘ్ర దర్శనం ధర రూ. 200 తో పాటు ఉచిత దర్శన టికెట్లను కూడా ఆన్ లైన్ లో భక్తులకు అందుబాటులో ఉంచారు.