టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. రాబోయే సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. సూపర్ స్టార్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి గారు టాలీవుడ్ కి నటిగా చాలా ఏళ్ల తరువాత రీఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా తరువాత మహేష్ బాబు మూడు నెలల లాంగ్ బ్రేక్ తీసుకుబోతున్నారు,
అయితే ఇటీవల మహేష్ బాబు, కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అది నిజమేనని, కాకపోతే వారిద్దరి కాంబోలో రాబోయే సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని మహేష్ సన్నిహితులు కొందరు చెప్పినట్లు టాక్. ఇప్పటికే మహేష్ కోసం పాన్ ఇండియా కథాంశంతో కూడిన భారీ యాక్షన్ మూవీ స్టోరీ ని సిద్ధం చేసిన ప్రశాంత్ నీల్, ఈ సినిమా కోసం పలువురు బాలీవుడ్, కోలీవుడ్ నటులను కూడా తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారట.
అయితే ఈ కథ ప్రస్తుతం స్క్రిప్టింగ్ స్టేజ్ లోనే ఉందని,కాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కు మంచి స్కోప్ ఉంటుందని, ఆ పాత్రకు గాను రకుల్ ప్రీత్ ను మహేష్ ప్రక్కన తీసుకోవాలని భావిస్తున్నారట ప్రశాంత్. గతంలో మహేష్, మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన స్పైడర్ సినిమాలో హీరోయిన్ గా రకుల్ నటించడం జరిగింది. అయితే అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ఘోరంగా విఫలమయింది. మరి నిజంగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్తలో కనుక వాస్తవం ఉంటె, మరొక్కసారి రకుల్, మహేష్ ప్రక్కన నటించే అద్భుతమైన ఛాన్స్ ని పట్టేసినట్లే……!!