టాలీవుడ్ లో అలా వచ్చి ఇలా మెరిసి అలా కనుమరుగైపోయిన హీరోయిన్స్ లు రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఆమె నటన రాకపోయినా గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా అభిమానులను సంపాదించుకుందనే వ్యాఖ్యలు వినిపించాయి. వరుస ఆఫర్లతో కెరీర్ పీక్ స్టేజి లో ఉన్న సమయంలో ఆమెకు వచ్చిన కొన్ని ఫ్లాప్స్ కెరీర్ ని బాగానే ఇబ్బంది పెట్టాయి. అగ్ర హీరోలతో సినిమాలు చేసింది ఈ పొడుగు కాళ్ళ సుందరి.
ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. అక్కడ ఆమెకు రెండు సినిమాలు గత ఏడాది మంచి హిట్ ఇచ్చాయి. ఇది పక్కన పెడితే, ఇప్పుడు ఈమె కాస్త బాధపడుతుంది. తన కెరీర్ ని తాను నాశనం చేసుకున్నా అని బాధ పడుతుంది. తాను వరుసగా గ్లామర్ పాత్రలను చేస్తూ.. అందాలను ఆరబోయటమే పెద్ద తప్పయి పోయిందని, తాను మంచి ఊపులో ఉన్నప్పుడు నటనకు ఆస్కారం ఉండే పాత్రలను ఎంచుకోలేకపోయానని,
అదే తనకు ఇప్పుడు అవకాశాలు లేకుండా చేసిందని తాను నిర్మాతలను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని, అనుకున్న సమయానికే షూటింగ్ కు వెళ్లేదాన్నని, వాళ్ళు ఏ సమయం చెప్తే ఆ సమయానికి అక్కడ ఉంటా అని చెప్పింది రకుల్. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమెకు మంచి ఆఫర్లు వచ్చినట్టే వచ్చి దూరమవుతున్నాయి. దీనితో ఇప్పుడు రకుల్ కెరీర్ పరంగా కాస్త ఇబ్బంది పడుతుంది. ఎం చెయ్యాలో అర్ధం కాని స్థితిలో ఉంది.