డేంజర్ జోన్ లో ఉన్న రకుల్ కెరియర్..!!

-

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ కొన్ని సంవత్సరాల పాటు తన హవా కొనసాగించింది. టాలీవుడ్ కి దూరంగా ఉంటున్న ఈమె బాలీవుడ్లో పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నది. చివరిగా 2019లో కొండ పొలం సినిమాలో నటించి ఆ తర్వాత టాలీవుడ్ నుంచి దూరమయ్యింది. బాలీవుడ్ లో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చి ఐదు సినిమాలలో నటించిన రకుల్ గత ఏడాది నుంచి పూర్తిగా బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది.

ఒక ఏడాదిలోనే రకుల్ ప్రీతిసింగ్ నటించిన ఐదు హిందీ చిత్రాలు విడుదల అవ్వగా.. అందులో ఎటాక్, రన్ వే 34, చట్ పుట్లి, థాంక్యూ గార్డ్, డాక్టర్ జి వంటి చిత్రాలలో నటించిన బ్యాక్ టు బ్యాక్ వరస సినిమాలను విడుదల చేయగా ఏవి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ కెరియర్ చాలా డేంజర్ జోన్ లో ఉందని వార్తలు కూడా బాలీవుడ్ నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఏడాది విడుదలైన చిత్రాలు ఎటాక్ సినిమా మాత్రం పరవాలేదు అనిపించుకున్న మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ లిస్టులో చేరిపోయాయి.

ఇలా బ్యాక్ టు బ్యాక్ ఒకేసారి ఇన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈమె కెరియర్ హిందీలో ముగిసినట్టే అని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవలే ఉమైర్ ఇచ్చిన రివ్యూ నెట్టింట హాట్ టాపిక్ గా మారుతోంది. దీంతో రకుల్ అభిమానులు కూడా కాస్త ఆందోళన చెందుతున్నారు. దీంతో పలువురు అభిమానులు కూడా రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్ కలిసి రాలేదని కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడైనా రకుల్ తన కెరియర్ లో కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news