తన అయ్యప్ప మాలాధారణపై సీక్రెట్స్ చెప్పిన రామ్ చరణ్

ఎప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉండే సినీ స్టార్స్ లైఫ్ స్టైల్ పై వారి అభిమానులు ఎప్పుడు ఆసక్తిగానే ఉంటారు. అయితే ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నడుస్తోంది. అయితే ఈ సినిమాలో నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లు ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్నారు. కొత్త కొత్త స్టైల్ తో కనువిందు చేసే సినీ స్టార్స్ భక్తి భావంతో మాలాధారణలో కనిపిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. రామ్ చరణ్ ఏడాదికి రెండు సార్లు అయ్యప్ప మాలా స్వీకరిస్తారు. అయ్యప్ప మాల ధరించడం గురించి రామ్ చరణ్ ను అడగగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Ram Charan arrives barefoot at Mumbai airport as he observes 41-day Ayyappa Deeksha

వరుస సినిమా షెడ్యూల్ తో ఒత్తిడితో ఉన్న తనకు అయ్యప్ప మాలధారణ ఎంతో ప్రశాంతతను ఇస్తుందన్నారు. మాలాధారణలో స్వామి వారికి చేసే పూజలో ఎంతో ప్రశాంతత దొరుకుతుందన్నారు. ప్రతి సంవత్సరం తన పుట్టిన రోజు నుంచి, మళ్లీ దసరా తరువాత మాలాధరిస్తానని, అయితే ఈసారి ట్రిపుల్‌ ఆర్ విడుదల సందర్భంగా మాల ముందుగా వేసుకోలేకపోయానని వివరించారు. అందుకే ఆర్ ఆర్ ఆర్ విడుదల తర్వాత వేసుకున్నట్లు రామ్ చరణ్ తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ సైతం మొదటిసారి ఆంజనేయ మాల ధరించారు. చాలా సంవత్సరాలుగా ఎన్టీఆర్ కూడా వేయాలి అనుకుంటున్నారని, అయితే ఇప్పటికి కుదిరిందని చెప్పుకొచ్చారు. రామ్‌చ‌ర‌ణ్‌ను చూసి ఎన్టీఆర్ ఆంజనేయ మాల ధారణ నిర్ణయం తీసుకున్నాడు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన రామ్ చరణ్ పై విధంగా చెప్పుకొచ్చారు.