రామ్ చరణా.. మజాకా.. వీరకొట్టుడు కొట్టుకున్న అమ్మాయిలు..

-

మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయ్యాడు..మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు.. చిరంజీవి క్రేజ్ ను ఎక్కడా ఉపయోగించుకోకుండా తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగారు చరణ్. మొన్నామధ్య వచ్చిన రంగస్థలం తో నటుడిగా తనకు తాను ప్రూవ్ చేసుకున్న చరణ్. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. ఇప్పుడు రామ్ చరణ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.

ఇక చరణ్ వస్తుందంటే ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండదు. కటౌట్లు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలతో రచ్చ రచ్చ చేస్తారు ఫ్యాన్. తాజాగా రామ్ చరణ్ ఫ్యాన్స్ రోడ్డు మీద పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు.. జుట్లు జుట్లు పట్టుకొని వీరకొట్టుడు కొట్టుకున్నారు.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. మాములుగా వేరువేరు హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగడం కామన్.. కానీ ఒకే హీరో ఫ్యాన్స్ కొట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.. అందులో అమ్మాయిలు నడి రోడ్డుపై కొట్టుకోవడం షాక్ అవుతున్నారు..

తాజాగా రామ్ చరణ్ లేడీ ఫ్యాన్స్ రోడ్డుమీద గొడవ పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామ్ చరణ్ ను ఒక చిన్న మాట అన్నందుకు ఇద్దరు అమ్మాయిలు ఇలా రోడ్డు మీద పడి కొట్టుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ ప్రేక్షకుల ముందుకు రానుంది…ఆ సినిమా ఎలాంటి హిట్ టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news