ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు అధికార వైసీపీ..ప్రతిపక్ష టిడిపికి చెక్ పెట్టి మళ్ళీ అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. ఇటు టిడిపి ఏమో వైసీపీని నిలువరించాలని చూస్తుంది. ఇటీవల పరిణామాలు టిడిపికి అనుకూలంగా నడుస్తున్నాయి. పైగా టిడిపి-జనసేన పొత్తు ఫిక్స్ అయ్యేలా ఉంది. అటు బిజేపి ఏమో టిడిపితో పొత్తు ప్రసక్తే లేదని అంటుంది.
దీంతో బిజేపిలో పలువురు నేతలు టిడిపిలోకి జంప్ అవ్వడానికి చూస్తున్నారు. ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ టిడిపిలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక పొత్తు లేకపోతే వేస్ట్ అని, బిజేపిలో ఉంటే డిపాజిట్లు కూడా రావని భావిస్తూ..మరికొందరు నేతలు కూడా బిజేపికి గుడ్ బై చెప్పేసి టిడిపిలోకి వచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుజనా చౌదరీ సైతం టిడిపిలోకి రావడానికి చూస్తున్నారని ప్రచారం మొదలైంది. అసలు ఈయన చంద్రబాబు రైట్ హ్యాండ్ అని ప్రచారం ఉంది. 2019 ఎన్నికల వరకు ఈయన టిడిపిలో నెంబర్ 2 అన్నట్లు పరిస్తితి ఉండేది.
ఈయనే చాలా సీట్లు డిసైడ్ చేశారు. కానీ 2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడంతో సుజనా బిజేపిలోకి వెళ్లారు. అసలు సుజనాని బిజేపిలోకి పంపించేది చంద్రబాబు అనే ప్రచారం ఉంది. మళ్ళీ బాబుని బిజేపికి దగ్గర చేయడానికే సుజనా చూస్తున్నారని కథనాలు వచ్చాయి. కానీ బిజేపి..టిడిపితో పొత్తుకు అంగీకరించడం లేదు.
ఈ క్రమంలో ఇంకా సుజనా మళ్ళీ టిడిపి లో చేరడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. తాజాగా ఆయన టిడిపి నేత ఆలపాటి రాజా ఇంటికొచ్చారు. అక్కడ రాజా, కన్నా, నక్కా ఆనందబాబులతో సుజనా భేటీ అయ్యారు. ఈ భేటీ బిజేపితో పొత్తు విషయమా? లేక సుజనా టిడిపిలో చేరే విషయమా? అనేది తెలియలేదు. పొత్తు లేదని అంటున్నారు కాబట్టి..సుజనా టిడిపిలో చేరడం కోసమే భేటీ అయ్యారని అంటున్నారు. త్వరలోనే ఆయన సైకిలెక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.