కొండారెడ్డి బురుజు దగ్గర తొడ గొట్ట బోతున్న రామ్ చరణ్..!!

-

పాన్ ఇండియా దర్శకుడు శంకర్ రాంచరణ్ 15వ సినిమాను స్టార్ట్  చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టాలని తపిస్తున్నాడు.ఈ సినిమా తో శంకర్ సమాజంలో జరిగే సీరియస్ పాయింట్ ను టచ్ చేస్తున్నాడట.అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

రీసెంట్ గా ఎలక్షన్ ప్రచారం కు సంబందించిన సీన్లు విశాఖ పట్టణం ప్రాంతంలో చిత్రీకరించారు. ఈ లోకేషన్స్ సీన్లు లీక్ అయి మీడియా లో వైరల్ గా మారాయి.ఇందులో రామ్ చరణ్ ఓల్డ్ గెటప్ లో తన పార్టీ గుర్తుకు ఓట్లు వేయమని కోరుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకి వచ్చింది.

ఈ సారి షూటింగ్ కర్నూల్ జిల్లాలో ఉన్న కొండారెడ్డి బురుజు దగ్గర  జరగబోతోందని తెలుస్తోంది. అసలే కొండారెడ్డి బురుజు అంటే తెలుగు ప్రేక్షకులకు ఎక్కడలేని పూనకం వస్తుంది. ఈ సినిమా లో కీలకం అయ్యే సీన్లు ఇక్కడ షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఇక్కడ షూట్ చేసే సీన్లు  సినిమాకే హైలెట్ అయ్యేలా ఉంటాయంటున్నారు యూనిట్ సిబ్బంది. ఇది జనవరి మొదటి వారంలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే కొత్త సంవత్సరం రోజున ఫ్యాన్స్ కోసం మంచి అప్డేట్ కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news