ఆ స్టార్ హీరో భార్య అంటే జాన్వికు ఎంతో ఇష్టమట..

-

బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మారుతూ వస్తుంది తన వ్యక్తిగత జీవితం, ఫ్యాషన్ విషయంలో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది అయితే తాజాగా మరోసారి టాలీవుడ్ గురించి మాట్లాడిన ఈ భామ తనకి ఇష్టమైన నటీనటుల కోసం చెప్పుకొచ్చింది అంతేకాకుండా వారితో పని చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిపింది..

జాన్వి కపూర్ 2018 లో వచ్చిన ధడక చిత్రంతో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది అయితే అప్పటినుంచి కొన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఈమె సౌత్ లో మాత్రం సినిమా చేయలేదు. అయితే ఈ విషయంపై ప్రశ్నలు ఎదురవుతూ వస్తున్నాయి అయితే ఇప్పటికే ఈ విషయంపై స్పందించిన జాన్వి తనకు అవకాశం వస్తే కచ్చితంగా సౌత్లో నటించడానికి వెనకాడనంటూ చెప్పుకొచ్చింది.. కొందరు దర్శకులు నటులతో నటించాలని ఉందంటూ తెలిపింది..

ఈ సందర్భంగా మాట్లాడిన జాన్వి.. జూనియర్ ఎన్టీఆర్‌ను వెరీ టాలెంటెడ్, చార్మింగ్ యాక్టర్‌ అంటూ చెప్పకు వచ్చింది అలాగే మొదటిసారి ‘ఆర్ఆర్ఆర్’ చూసిన తర్వాత వెంటనే తన యాక్టింగ్ గురించి తెలుసుకునేందుకు ‘జనతా గ్యారేజ్‌’ చూసినట్లు వెల్లడించింది. ఇప్పటికే ఇండియాలో ఎంతోమంది తారకు అభిమానులని అందులో నేను కూడా ఒకరంటూ చెప్పకు వచ్చింది.. అలాగే అల్లు అర్జున్ అంటే కూడా తనకు ఎంత ఇష్టమని వీరిద్దరితో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిపింది.. అంతేకాదు ‘జనతా గ్యారేజ్’ డైరెక్టర్ కొరటాల శివ, ‘పుష్ప’ డైరెక్టర్ సుకుమార్ సర్‌తో కూడా వర్క్ చేయాలనుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది..

అలాగే ‘కాంతార’ మూవీ గురించి మాట్లాడుతూ.. రిషబ్ శెట్టికి ఫ్యాన్ అయిపోయానని, చివరి 30 నిమిషాల్లో తన పెర్ఫామెన్స్ చాలా ప్రత్యేకంగా ఉందని ప్రశంసించింది. ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిందంటూ తెలిపింది.. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత అంటే తనకి ఎంతో ఇష్టమని తన వ్యక్తిత్వం ప్రత్యేక అంటూ తెలిపింది..

Read more RELATED
Recommended to you

Latest news