టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. సాయి ధరంతేజ్ తీవ్రంగా గాయపడటంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే తేజ కు కలర్ బోన్ సర్జరీ జరిగింది. దాంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కాగా తాజాగా బిగ్ బాస్ షో లో అతిథిగా వచ్చిన రామ్ చరణ్ తేజ్ ఆరోగ్యంపై స్పందించారు. నాగార్జున తేజ్ ఆరోగ్యం గురించి ఆరా తీయగా ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కోరుకుంటున్నారని చెప్పారు. అయితే మెల్లిగా కోరుకుంటున్నారని ఇంకా కొన్ని రోజులు రెస్ట్ అవసరమని రామ్ చరణ్ వెల్లడించారు. నాగార్జున చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. అంతే కాకుండా బిగ్ బాస్ లో రామ్ చరణ్ ఇంటి సభ్యులతో సరదాగా గడిపారు.
తన తల్లి, నానమ్మ కూడా ప్రతి రోజు బిగ్ బాస్ చూస్తున్నారని చెప్పారు. నాగార్జున బిగ్ బాస్ తో తన రికార్డులను తానే కొల్లగొడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. నాగార్జున ఈ వయసులో కూడా అందంగా ఉన్నారని ఆయన గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పాలని అడిగారు. ఇక నాగ్ కూడా చరణ్ ,ఎన్టీఆర్, ప్రభాస్ లు ఎంతో ఎనర్జిటిక్ ఉంటారని అన్నారు. ఆర్ ఆర్ ఆర్ ఎలా వస్తుంది చెప్పాలని కోరగా చరణ్ మాత్రం జక్కన్న నాకే ఒక్క సీన్ కూడా చూపించలేదని అన్నారు.