నాగబాబుకు రామ్ గోపాల్ వర్మ సపోర్ట్! ఇదేదో తేడాగా ఉందే.!

-

రామ్ గోపాల్ వర్మ శివ సినిమా తీసిన దర్శకుడు. అప్పట్లో ఆ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. తర్వాత మనోడు పడిపోతూ పాతాళం కు చేరుకున్నాడు. ఇక పిచ్చి సినిమా లు తీస్తూ అందులో విషయం లేకపోయినా ఇన్నాళ్లూ తన పబ్లిసిటీ స్టంట్ లతో మాయ చేస్తూ తన సినిమాలకు ఫ్రీ పబ్లిసిటీని ప్లాన్ చేస్తూ నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తాడు.ఇక మెగా ఫ్యామిలీ అంటే రెచ్చి పోయే రామ్ గోపాల్ వర్మ తాజాగా ఒక విషయంలో మెగా బ్రదెర్ నాగబాబు కామెంట్స్ ను సమర్ధించారు.

ఇక నాగబాబు కూడా మెగా ఫ్యామిలీ మీద ఎవరు ఆరోపణ చేసినా కూడా దానికి తగ్గట్టు గానే పంచ్ లతో విరుచుకు పడతారు. తాజాగా నాగబాబు సినిమాలు గురించి చెబుతూ ఇది వ్యాపారం అంటూ తన అభిప్రాయం పంచుకు న్నాడు . ఆయన తన ట్వీట్ లో సినిమాల్లో ఉన్న హింస కారణంగా జనాలు చెడిపోతున్నారనేది నిజమైతే, అదే సినిమాల్లో చూపించే మంచి వలన బాగుపడాలి కదా. ఒక నిర్మాతగా నేను చెప్పేది ఏమిటంటే… సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే, జనాలను సమాజాన్ని బాగు చేయడం కోసం కాదు. అంతటి మేధావులు ఎవరూ లేరు. సినిమా కేవలం బిజినెస్ అని చెప్పారు.

దీనిపై నెటిజన్స్ రకరకాలు గా కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది సపోర్ట్ చేయగా మరికొంత మంది విమర్శలు ఎక్కుపెట్టారు.ఇక ఎప్పుడూ మెగా ఫ్యామిలీ పై విమర్శలు చేసే రామ్ గోపాల్ వర్మ కూడా ఈ ట్వీట్ కు బదులు ఇస్తూ పెర్ఫెక్ట్ కరెక్ట్ అంటూ మద్దతు తెలిపారు. ఇది చూసి నెటిజన్స్ ముక్కు మీద వేలు వేసుకున్నారు. మరి కొంత మంది మాత్రం రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేటు అని కామెంట్స్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news