రామ్ గోపాల్ వర్మ కామెడీ కి అంతు లేదా..!!

-

రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు మంచి సినిమాలు తీశారు, కాని ఇప్పుడు మాత్రం అన్ని రకాల అవలక్షణాలు తో తన ఇమేజ్ ను ఎంత డామేజ్ కావాలో అంతగా అయ్యాడు. ఇక తాను వోడ్కా వేసుకొని అమ్మాయిలతో సయ్యాటలు, వాళ్ల చుట్టూ తిరుగుతూ పొర్లు దండాల వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. ఇక తాను వేలు పెట్టని విషయం అంటూ ఏది వుండదు.

తాజాగా మునుగోడు లో పోటీ చేసిన కేఏ పాల్ పై తన దైన శైలిలో విమర్శలు చేశాడు. ఇక కేఏ పాల్ విన్యాసాలు కూడా తక్కువ కాదు. ప్రచారం లో ఆయన డాన్సులు, వేషాలు తో మీడియాతో హంగామా చేశాడు. మునుగోడులో  గెలవబోయేది తానేనని రెండవ స్థానం మూడో స్థానం కోసం వాళ్లే కొట్టుకుంటారని గొప్పలు చెప్పారు. ఎన్నికల్లో ఓడి పోయాక ఎన్నికల సంఘం అధికారులు బీజేపీ, టీఆర్ఎస్ కు తొత్తులుగా పనిచేశారు కాబట్టి తాను ఓడిపోయానని విమర్శించారు. దీనితో వర్మకు మంచి మసాలా దొరికినట్లు అయ్యింది.

ఇక ట్విట్టర్ లో  కేఏ పాల్ పై ఒక రేంజు లో విజ్రంబించాడు.తన ఓటమి తో కేఏపాల్ టెర్రరిస్ట్ లతో  మునుగోడు నియోజకవర్గం మీద బాంబులు వేయిస్తున్నాడని తెలిసింది, అక్కడివారు ప్రాణాల కోసం పారిపోవాలని, అలాగే ప్రభువుతో మునుగోడులో ఎలాంటి పంటలు పండకుండా చేయడం వంటి దారుణాలకు పాల్పడ బోతున్నాడని వెంగ్యంగా ట్వీట్ చేశాడు. ఇక కేఏ పాల్ 2024 అక్కడ అమెరికా ప్రెసిడెంట్ అయ్యి మునుగోడు ప్రజల మీద కసితో అణుబాంబు బాంబు వేస్తాడని వర్మ తన వెటకారం కలిపి కామెంట్స్ చేసాడు. ఇక వర్మ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news