RGV: రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) వివాదాలకు కేరాఫ్ అడ్రాస్. ఆయన ఏం చేసినా.. అదో సంచలనం . తాజాగా ఆయన చేసిన పనికి ఎంటర్‌టైన్మెంట్ మార్కెట్ కొంత పుంతలు తొక్కింది. మార్కెట్ విస్తృతి మరింత పెరిగింది. తొలినాళ్లలో ఎంటర్ టైన్ మెంట్ అంటే.. వీధి నాటకాలు, తరువాత సినిమాలు, సీరియళ్లు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మరింత అప్డేట్ అవుతూ వస్తున్నాం. ఈ నయా డిజిటల్ యుగంలో ఓటీటీ ఎంటర్ టైన్ మెంట్ వేదికలయ్యాయి.
ఈ డిజిటల్ వేదిక మీద పూర్తి అవగాహన రాకముందే మరో మార్కెట్‌కు గేట్లు ఓపెన్ చేశారు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అదే నాన్ ఫంజిబుల్ టోకెన్…( ఎన్‌ఎఫ్‌టీ). ఎన్ ఎఫ్ టీ అనేది బ్లాక్ చైన్ సిస్టమ్. క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్, ఈథిరియం, డోగ్ కాయిన్ వంటివి అత్యంత ప్రాచుర్యం పొందాయో ఇప్పుడూ ఈ డిజిటల్ టోకెన్ కూడా అందరిని ఆకర్షిస్తోంది. ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి ఇప్పుడు నయా మార్కెట్.
ఈ ఫ్లాట్ ఫాం ద్వారా మనం కూడా సినిమాలకు పెట్టుబడి పెట్టవచ్చు. మనం కూడా నిర్మాతలు కావోచ్చు. ఎన్‌ఎఫ్‌టీలో సినిమాను అమ్మకానికి పెట్టినప్పుడు ఆ సినిమాను వాల్యూన్ యూనిట్స్‌గా చెబుతారు. మన ఇంట్రస్ట్‌ను బట్టి, కంటెంట్ మీద ఉన్న నమ్మకాన్ని బట్టి.. ఎన్ని యూనిట్లైనా కొనుక్కోవచ్చు. ఆ తరువాత ఆ సినిమాను ఏ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేసినా… ( థియేట్రికల్ రిలీజ్, ఓటీటీ, యూట్యూబ్ స్ట్రీమింగ్, శాటిలైట్ టెలికాస్ట్) ఆ సినిమా మీద ఏ రకంగా రెవెన్యూ వచ్చినా.. అందులో మీ షేర్ ఆటోమేటిక్‌గా మీ అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయి.
ఇప్పుడూ ఇలాంటి మార్కెట్ మీద.. ప్రపంచంలోనే తొలిసారిగా తన సినిమా డేంజరస్‌ను సేల్ చేసి.. చరిత్ర సృష్టించారు ఆర్జీవీ. మూవీ మార్కెట్ ను మరింత పెంచారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆయనో ట్రెండ్ సెట్టర్.