’నన్నిలా ఎందుకు వేధిస్తున్నావ్.. నేనేం పాపం చేశాను.. గొడవలకు కారణం నువ్వా..? నేనా..? ఓ సారి ఆలోచించుకో.. నేనెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టలేదు..‘ అంటూ సెల్పీ.. తరువాత ఆత్మహత్య. దంపతుల మధ్య జరిగిన గొడవలు ఒకరి మరణానికి కారణమయ్యాయి. భర్తతో గొడవ పడిన భార్య ఇంటి నుంచి బయటకు వెళ్లింది.. ఆతర్వాత వచ్చి సీన్ చూసి లబోదిబోమంది.. వివారాల్లోకి వెళితే..
రాజస్థాన్ లోని భిల్వార్ పట్టణం తిక్రీ గ్రామానికి చెందిన ఖుష్రాజ్ మీనా(30)కి, అదే ప్రాంతానికి చెందిన ప్రియాంకతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఖుష్రాజ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఇంటిని పోషిస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా కుటుంబంలో గొడవలు ఏర్పడ్డాయి. తాజాగా గురువారం కూడా ఖుష్రాజ్, ప్రియాంకలు గొడవ పడ్డారు. భర్తతో గొడవ జరిగిన తర్వాత ఇంటి నుంచి ప్రియాంక బయటకు వెళ్లే క్రమంలో ’బయటకు వెళ్లవద్దని ఏమైనా ఉంటే ఇంట్లోనే మాట్లాడుకుందాం‘ అని ఖుష్రాజ్ ప్రాధేయపడ్డాడు. అయినా వినకుండా ప్రియాంక ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
సంఘటన స్థలానికి చేరుకున్న హనుమాన్ నగర్ పోలీసులు కేసును నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ భార్యభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవని, గురువారం కూడా మరోసారి గొడవ జరగడంతో ఖుష్రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.