ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలూడదీస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ కామెంట్స్ పై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
‘‘పోలీసులను బట్టలూడదీసి కొడతానంటున్న జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే. పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకన్నారు అనుకుంటున్నారు. మేం కష్టపడి చదవి, పరుగు పందేల్లో పాసై.. వేలాది మంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి.. ఎన్నో రాత్రులు నిద్రాహారాలు మానేసి కష్టపడి పోటీలో నెగ్గి వేసుకున్న యూనిఫాం ఇది. మీరొచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి ఇదేం అరటి తొక్కకాదు. మేం నిజాయతీగా ప్రజల పక్షాన నిలబడతాం. నిజాయతీగా ఉద్యోగం చేస్తాం. నిజాయతీగానే చస్తాం తప్ప. అడ్డదారులు తొక్కం. జగన్ కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. అంతే జాగ్రత్తగా ఉండండి’ అంటూ జగన్‌ను హెచ్చరించారు.