Ravi Teja: రామారావు ఆన్ డ్యూటీ ట్వీట్టర్ రివ్యూ..

-

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా “రామారావు ఆన్ డ్యూటీ”. శరత్ మండవ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను s.l.v. సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు.

యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజ్‌ అయింది. ఈ నేపథ్యంలోనే.. రవితేజ ఫ్యాన్స్, సినీ ప్రియులు ట్విట్టర్‌ వేదికగా సినిమా రివ్యూ ఇచ్చేస్తున్నారు. డిప్యూటీకలెక్టర్‌ పాత్రలో రవితేజ అదరగొట్టినట్లు తెలుస్తోంది. ఫస్ట్‌ హాఫ్‌ లో రవితేజ లుక్‌, మాస్‌ ఎలిమెంట్స్‌ అదిరిపోయాయని చెబుతున్నారు. సాంగ్స్‌ యావరేజ్‌ గా ఉన్నా.. బ్యాక్‌ గ్రౌండ్‌ సూపర్‌ గా ఉందట. శరత్‌ మండవకు డైరెక్టర్‌ గా ఇది తొలి సినిమా అయినా, రవితేజను మాస్‌ లుక్‌ లో బాగా చూపించారట.

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news