12వ తరగతి మార్కులతో సంబంధం లేకుండా ఎన్ఐటీలలో ప్రవేశాలు: రమేష్ పోఖ్రియాల్

-

దేశంలో కరోనా విజృంభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ క్లిష్ట పరిస్థితుల్లో విద్య సంస్థలపై కేంద్ర పలు నిర్ణయాలు తీసుకున్న సంగతి అందరికి తెలిసందే. అయితే ఎన్ఐటీ వంటి సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు 12వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ ఉంటేచాలని కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. జేఈఈ మెయిన్స్ 2020 పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు 12వ తరగతి మార్కులతో సంబంధం లేకుండా కేవలం ఉత్తీర్ణత సర్టిఫికేట్ ద్వారా ఎన్ఐటీ వంటి విద్యా సంస్థల్లో ప్రవేశం పొందవచ్చని ఆయన తెలియజేశారు.

nit
nit

ఇప్పటి వరకు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్స్‌లో తొలి 20 శాతం మందిలో స్థానం పొందటంతో పాటు 12వ తరగతి బోర్డు పరీక్షలో కనీసం 75 శాతం మార్కులు సాధించాల్సి ఉండాలని రమేశ్ ప్రోఖియాల్ తెలిపారు. అయితే కరోనా నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా, ఎన్‌ఐటిలు, ఇతర సిఎఫ్‌టిఐలలో ప్రవేశానికి అర్హత ప్రమాణాలను ఈ మేరకు సడలించాలని సెంట్రల్ సీట్ కేటాయింపు బోర్డు (సీఎస్‌ఏబీ) నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news