రేపిస్టులపై జాలి అవసరం లేదన్న రాష్ట్రపతి… కీలక వ్యాఖ్యలు…!

-

కేవల౦ పది రోజుల్లో… పది అంటే పది రోజుల్లో దిశ హత్య కేసు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. నవీన్, శివ, చెన్నకేశవులు, పాషా ని… దిశ ని కాల్చి చంపిన చోటే… పోలీసులు ఎన్కౌంటర్ చేసారు. ఘటనా స్థలానికి ఈ ఉదయం తీసుకు వెళ్ళిన పోలీసులు వాళ్ళను అక్కడే ఎన్కౌంటర్ చేసారు. పారిపోతుండగా వాళ్ళను కాల్చేశారు పోలీసులు. పోలీసుల చర్యపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. బాధితురాలికి న్యాయం జరిగిందని ఇలాంటి చర్యలకు ఎవడైనా పాల్పడాలి అంటే… భయపడతాడని వ్యాఖ్యానిస్తున్నారు.

సిని రాజకీయ ప్రముఖులు పోలీసుల తీరుని  అభినందిస్తున్నారు. సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ పని తీరుని అభినందిస్తున్నారు. వాళ్ళను రోజుల తరబడి జైల్లో మేపడం కంటే ఇదే మంచి పద్ధతి అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటి వాళ్ళు భూమి మీద ఉండకూడదని, ఉంచితే పాపమని… తెలంగాణా పోలీసులు రియల్ హీరోలు అని వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసులు తీసుకున్న చర్యపై రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ స్పందించారు. నిందితులకు ఇదే సరైన శిక్ష అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

రేపిస్ట్ లపై జాలి చూపించాల్సిన అవసరం లేదని… క్షమాభిక్ష పిటీషన్లను త్వరగా తేల్చాలన్నారు. వాళ్ళను కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేసారు. ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద… నిర్భయ రేప్ కేసు నిందితులకు సంబంధించి క్షమాబిక్ష పిటీషన్లు ఉన్నాయి. వాటిని ఆయన తిరస్కరించే అవకాశం ఉందని అంటున్నారు. ఆ పిటీషన్లను తిరస్కరించాలని జాతీయ మహిళా కమీషన్ ఇప్పటికే రాష్ట్రపతికి లేఖ రాసింది. ఆయన తిరస్కరిస్తే వారికి వచ్చే నెల ఉరి శిక్ష అమలు కానుంది. ప్రస్తుతం ఈ కేసులో నలుగురు నిందితులు తీహార్ జైల్లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news