కోట నుండి భయంకర శబ్దాలు.. దయ్యాలున్నాయంటూ బోర్డ్ పెట్టిన ప్రభుత్వం.

-

మూఢనమ్మకాలని నమ్మకూడదు అని ప్రచారం చేసే ప్రభుత్వం దయ్యాలున్నాయని నమ్ముతుందా..? ఈ కథ వింటే నిజమే అనిపిస్తోంది. భారతదేశంలో ఉన్న ఒకానొక పురాతన కోట గురించి తెలిసినవారెవరైనా దయ్యాలున్నాయని నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అవును, ప్రభుత్వమే ఆ కోటలో దయ్యాలున్నాయని రాత్రిపూట అక్కడ సంచరించవద్దు అని బోర్డ్ పెట్టిందంటే ఏమని అర్థం చేసుకోవాలి.

భాన్ గఢ్ కోట..

పొద్దున్న పూట వచ్చిపోయే పర్యాటకులతో కిటకిటలాడే ఈ కోట, రాత్రవగానే ఒక్క పురుగు కూడా కనిపించరు. దానికి కారణం అక్కడ నుండి వచ్చే శబ్దాలే. గజ్జెల చప్పుడుతో పాటు సన్నని కూని రాగాలు ఆ కోట నుండి వినిపిస్తాయట. అందుకే ప్రభుత్వమే అక్కడ బోర్డ్ పెట్టింది. రాత్రిపూట అక్కడ ఎవ్వరూ తిరగొద్దని.

రాజస్థాన్ లో ఉన్న ఈ కోట చరిత్ర చూస్తే, 1537లో మహారాజా భగనాన్ దాస్ తన కొడుకు మాధవ్ సింగ్ కోసం ఈ కోటని కట్టించాడట. ఈ మాధవ్ సింగ్ అక్బర్ సేనాని మాన్ సింగ్ కి తమ్ముడు. మాధవ్ సింగ్ తర్వాత ఈ కోట, తన కొడుకు ఛత్రసింగ్ వశమైంది. 1630లో ఛత్రసింగ్ చనిపోయాడు. ఇక అప్పటి నుండి కోట తన వైభవం కోల్పోయింది. ఆ తర్వాత 1720 లో రాజా జయసింగ్, ఆ కోటని ఆక్రమించుకున్నాడు. కానీ 1783లో ఏర్పడిన కరువు కోటని మరింత అంధకారంలోకి తోసింది.

ఐతే ఇంత చరిత్ర ఉన్న కోటలో నుండి ఇలాంటి శబ్దాలు ఎందుకు వస్తున్నాయనే చాలా మంది ప్రశ్న.. దీనికి సమాధానంగా అక్కడ ఒక కథ ప్రచారంలో ఉంది.

ఆ కోట వైభవం కోల్పోయాక అక్కడ ఒక బాబా తపస్సు చేసుకునేవాడట. బాబా భోలేనాథ్ అనే బాబా తపస్సు చేసుకుంటూ ఉండగా, అక్కడికి ఒక రాజు వచ్చి, ఆ కోటని ఆక్రమించుకుంటానని, మళ్ళీ నిర్మించుకుంటానని తెలుపగా, బాబా భోలేనాథ్ ఓకే చెప్పాడట. కానీ ఒక షరతు పెట్టాడట. రాజా.. నువ్వు కోటని ఏమైనా చేసుకో.. కానీ ఆ కోత నీడ నామీద పడకూడదని, అలా పడితే గనక ఊరంతా సమాధి అవుతుందని హెచ్చరించాడట. బాబా చెప్పినట్టుగానే కోట నీడ పడకుండా నిర్మాణం చేస్తూ వచ్చాడట. కొన్ని రోజులకి బాబా చనిపోవడం, ఆ తర్వాత రాజుగారు అంతా మర్చిపోవడం, కోట ఎత్తు పెరిగి పెరిగి, ఆ నీడ బాబా సమాధి పడటం జరిగింది.

దాంతో అప్పటి నుండి ఆ కోట నుండి శబ్దాలు రావడం మొదలయ్యాయని స్థానికులు నమ్ముతున్నారు. ఏది ఏమైనా భారతీయ పురావస్తు శాఖవారే అక్కడ రాత్రిపూట ఉండవద్దని బోర్డు పెట్టారంటే ఆ కోట ఎంత భయంకరమైనదో అర్థం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news