సాధ్వి అక్కడ అడుగుపెడితే సజీవ దహనం చేస్తాం: కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

-

మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సేని దేశభక్తుడని చెబుతూ.. భోపాల్ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ పార్లమెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా సాధ్వి వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం చెలరేగింది. దీంతో బీజేపీ ఆమె మాటలను ఖండిస్తున్నట్లు తెలిపింది. ఇక త్వరలోనే బీజేపీ నుంచి ఆమెను ఆ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేయనుందని కూడా తెలుస్తోంది. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వాఖ్యలు మళ్లీ దుమారాన్ని రేపుతున్నాయి.

We Will burn Sadhvi alive if she sets foot in MP says Congress MLA

బీజేపీ ఎంపీ సాధ్వి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. మధ్యప్రదేశ్‌లోని బయోరా నియోజకవర్గ ఎమ్మెల్యే గోవర్ధన్ దంగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాధ్వి మధ్యప్రదేశ్‌లో అడుగు పెడితే ఆమెను సజీవంగా దహనం చేస్తామని ఆయన అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాగా సాధ్వి ఇప్పుడే కాదు, గతంలోనూ గాడ్సేపై ఇలాంటి వ్యాఖ్యలే చేసి ఆ తరువాత క్షమాపణలు కోరారు. ఈ క్రమంలో మరొకసారి ఆమె అలాంటి వ్యాఖ్యలు చేసి ఏకంగా తన పదవికే ఎసరు తెచ్చుకోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news