హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్ట్ లో జిహెచ్ఎంసి కి భారీ ఊరట లభించింది. గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి ఇస్తూ తీర్పు ఇచ్చింది. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి ఎట్టకేలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

supreme-court
supreme-court

ఈ ఏడాది కి అనుమతి ఇచ్చిన సుప్రీం కోర్టు ధర్మాసనం… అఫిడవిట్ దాఖలు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పు తో…. గణేష్ నిమజ్జనానికి లైన్ క్లియర్ అయింది. ఇక అటు ఈ గణేష్ నిమజ్జనం వ్యవహారం పై తెలంగాణ ప్రభుత్వం పై సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ సీరియస్ అయినట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ ప్రభుత్వ తీరు వల్లనే హుస్సేన్సాగర్ కలుషితం అవుతోందని అభిప్రాయపడ్డారు ఎన్.వి.రమణ. వచ్చే ఏడాది కి… గణేష్ నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఎన్.వి.రమణ.