బండి సంజయ్ ది కూల్చుడు.. రేవంత్ ది పేల్చుడు – రసమయి బాలకిషన్

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ది కూల్చుడు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిది పేల్చుడని మండిపడ్డారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. అసెంబ్లీ లాబీల్లో రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. ప్రజల్లో భారాసకు మంచి అనుకూల వాతావరణం ఉందన్నారు. భాజపాది అంతా బొబ్బ మాత్రమేనని ఏద్దేవా చేశారు. కేసీఆర్ నాయకత్వం ముందు రేవంత్, బండి సంజయ్ నాయకత్వం ఎంత? అని ప్రశ్నించారు.

కరీంనగర్ ఎంపీగా ఉన్న సంజయ్… ఆగకుండా 20 గ్రామాల పేర్లు చెప్పగలరా ? అని ఏద్దేవా చేశారు. మూడో సారి కాబట్టి ఎక్కడో అక్కడ అసంతృప్తి ఉందేమోనని.. కానీ లైన్లలో నిలబడి ఓటు వేసే ప్రజలు మాత్రం పూర్తి స్పష్టతతో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీయే రెండో స్థానంలో ఉంటుందని.. యువత కూడా వాస్తవాలను అర్థం చేసుకొందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news