సౌత్ సినిమాల్లో డప్పుల గోల తప్ప ఇంకేం ఉండదంటూ రష్మిక మందన వైరల్ కామెంట్స్..

-

స్టార్ హీరోయిన్ రష్మిక మందన మరొకసారి తన మాటలతో వివాదాస్పదంగా మారారు దక్షిణాది చిత్రాలపై ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.రష్మిక మందన కు స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది సౌత్ సినిమాలే ఆమె ఇప్పటికే తెలుగు తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది అలాగే కన్నడ భాషలో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అయితే ఇప్పుడు హిందీ చిత్రంలో నటిస్తుంది ఈ సందర్భంగా సౌత్ ఇండియా సినిమాలపై కించపరిచేటట్టు కామెంట్ చేసింది..

 

రాష్మీక లేటెస్ట్ బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను ప్రమోషనల్ ఈవెంట్లో అనాలోచిత వ్యాఖ్యలు చేశారు. ఇందులో మాట్లాడుతూ రొమాంటిక్ సాంగ్స్ అనగానే బాలీవుడ్ గుర్తుకు వస్తుంది. చిన్నప్పటి నుండి నేను బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ వింటూ పెరిగాను. సౌత్ చిత్రాల్లో ఈ తరహా రొమాంటిక్ సాంగ్స్ ఉండవు. అక్కడంతా మాస్ మసాలా ఐటెం సాంగ్స్ మాత్రమే ఉంటాయి. ఇది నా కెరీర్ లో బెస్ట్ రొమాంటిక్ సాంగ్ అని… మిషన్ మజ్ను మూవీలో సాంగ్ ని ఉద్దేశిస్తూ అన్నారు. ఈ మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి అన్ని సినీ పరిశ్రమల వారు రష్మిక పైన తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు.. ఆమెకు బాలీవుడ్ మ్యూజిక్ ఇష్టం అయితే… వారిని పొగడటంలో ఎలాంటి తప్పు లేదు. ఆ పేరుతో సౌత్ మ్యూజిక్ ని దిగజార్చి మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ ఫైర్ అవుతున్నారు..

సౌత్ లో వచ్చిన రొమాంటిక్ సాంగ్స్ ఇప్పటివరకు రష్మిక వినలేదు అనుకుంటా.. ఇళయరాజా స్వరపరిచిన రొమాంటిక్ సాంగ్స్ కు మించిన గొప్ప మెలోడీలు, రొమాంటిక్ సాంగ్స్ ఇచ్చిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరో ఆమె చెప్పాలి. మరి ఆస్కారం అందుకున్న ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన రొమాంటిక్ సాంగ్స్ సంగతి ఏంటి రోజా ముంబై ప్రేమదేశం సఖి ప్రేమికుల రోజు సినిమా పాటలు అప్పట్లో యువతను ఊరూతలూగించాయి.. సాంప్రదాయ సంగీతాన్ని అందించిన సౌత్ ఇండియాలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి మంగంపల్లి బాలమురళీకృష్ణ పాటలు ఎంతటి చరిత్రను సృష్టించాయి తెలిసే జ్ఞానంతో రజినీకాంత్ మ్యూజిక్ ని ఇంతగా కించపరచడం మసాలా ఐటమ్ సాంగ్స్ పేరుతో పరువు తీయడం సరికాదు అంటూ ఆమెపై విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news