అందులో సమంత మాదిరిగా ఇందులో రష్మిక….??

-

టాలీవుడ్ లో వెరైటీ కాన్సెప్ట్ సినిమాలకు పెట్టింది పేరైన సుకుమార్, గత ఏడాది రామ్ చరణ్ మరియు సమంతల కలయికలో తెరకెక్కించిన రంగస్థలం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో మనకు అందరికీ తెలిసిందే. 1980ల కాలం నాటి కథతో సుకుమార్ తెరకెక్కించిన ఆ సినిమాలో చెవిటి వాడిగా రామ్ చరణ్ నటించగా, పెల్లెటూరి సాధారణ అమ్మాయిలా సమంత కనపడుతుంది. దాని అనంతరం అతి త్వరలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక సినిమాను తెరకెక్కించనున్నారు సుకుమార్. ఇటీవల ఈ సినిమా అధికారిక పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం. అలానే ఈ సినిమాలో అల్లు అర్జున్, ఇంతక మునుపెన్నడూ కనిపించనంత మాస్ మరియు రఫ్ లుక్ లో దర్శనం ఇవ్వనున్నారని, అలానే హీరోయిన్ రష్మిక ఒక ఎర్రచందనం కూలీగా పూర్తిగా డీ గ్లామర్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. రంగస్థలంలో సమంత మాదిరిగా ఈ సినిమా ద్వారా రష్మిక మంచి పేరు సంపాదించడం ఖాయం అంటున్నారు. కాగా అటువంటి పాత్రల కోసం ఇప్పటికే హీరో, హీరోయిన్లు ఇద్దరూ కూడా ప్రత్యేకంగా సిద్దమవుతున్నారట.

ఇక సుకుమార్ సినిమాల్లో ఈ సినిమా ఒకింత ప్రత్యేకంగా తెరకెక్కనుందట. ఇకపోతే ఈ సినిమాలో నటించబోయే మిగతా నటీనటులు మరియు సాంకేతిక నిపుణులను అతి త్వరలో ప్రకటించనుంది సినిమా యూనిట్. వైవిధ్యమైన కథాంశంతో, విభిన్నమైన స్క్రిప్ట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాకు సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. నిర్మాతలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు టాక్. మరి ముచ్చటగా మూడవసారి అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా, ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి…!!

Read more RELATED
Recommended to you

Latest news