తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికాకు బీజేపీ మరికాసేపట్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి నోటిఫికేషన్ రావడంతోనే నామినేషన్ల సందడి మొదలైంది. ప్రధాన పార్టీలయిన టీడీపీ- వైసీపే ఎప్పుడో అభ్యర్థుల ప్రకటన చేశారు. కానీ ఎప్పటి నుంచో పోటీకి సై అంటున్న బీజేపీ మాత్రం తమ అభ్యర్థి ఎవరో తేల్చడం లేదు. ఐదు నెలలుగా విస్తృత స్థాయిలో రాష్ట్ర నేతలు కసరత్తు చేసినా అభ్యర్దిని మాత్రం తేల్చలేక పోయారు.
అయితే ఎట్టకేలకు తిరుపతి ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి రత్నప్రభను ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు. రత్న ప్రభను అభ్యర్ధిగా కాసేపట్లో అధికారికంగా బీజేపీ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో ప్రధాన కార్యదర్శి గా పనిచేసి రిటైర్ అయిన రత్నప్రభ కంటే ముందు మరో రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు పేరును పరిశీలించారు. ఈ ఇద్దరిలో ఒకరు కచ్చితంగా అభ్యర్థిగా ఉంటారు అంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు.