Ravi teja : “రావణాసుర” నుంచి మాస్ గ్లింప్స్ రిలీజ్..రవితేజ ఫ్యాన్స్ కు జాతరే

-

హీరో రవితేజ..వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 3 సినిమాలను లైన్‌ లో పెట్టారు ఈ మాస్‌ మహారాజు. ఇక ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా” రావణాసుర” అనే చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది.

ఈ సినిమాలో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

అభిషేక్ పిక్చర్స్, ఆర్జి టీం వర్క్స్ బ్యానర్స్ పై సినిమా నిర్మితమౌతుంది.హర్షవర్ధన్ రామేశ్వర్, బీమ్స్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. అయితే..ఈ సినిమా ఇవాళ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. రవితేజ పుట్టిన నేపథ్యంలోనే.. ఈ అప్డేట్‌ ను ఇచ్చారు. కాగా ఈ ఏడాది అంటే ఏప్రిల్ ఏడో తేదీన 2023లో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news