సక్సెస్‌ రాగానే రెమ్యూనరేషన్‌ పెంచిన రవితేజ

-

సూపర్‌హిట్ పడితే కెరీర్‌కి బూస్టప్ వస్తుంది. అలాగే రెమ్యూనరేషన్‌లో కొంచెం మార్పులొస్తాయి. కానీ రవితేజ మాత్రం సింగిల్ హిట్‌తో డబుల్‌ రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేస్తున్నాడట. అడిగినంత ఇస్తేనే కాల్షీట్స్‌ అంటున్నాడట రవితేజ. ఇంతకీ రవితేజ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు?

రవితేజకి ‘రాజా ది గ్రేట్’ తర్వాత వరుస ఫ్లాపులొచ్చాయి. ‘టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటొని, డిస్కోరాజా’ ఫ్లాపులతో మార్కెట్‌ కూడా పడిపోయింది. ఈ డిజాస్టర్లతో రవితేజ పనైపోయిందనే కామెంట్స్‌ కూడా వచ్చాయి. ఇలాంటి టైమ్‌లో ‘క్రాక్’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు రవితేజ.

‘క్రాక్’ సంక్రాంతి సీజన్‌ని క్యాష్‌ చేసుకుని, క్రేజీ కలెక్షన్లు అందుకుంది. క్రాక్‌ఫైడ్ అనే రెస్పాన్స్‌తో ఈ ఇయర్‌కి ఫస్ట్‌ హిట్‌గా నిలిచింది ‘క్రాక్’. ఇక చాలాకాలం తర్వాత వచ్చిన ఈ సక్సెస్‌తో బ్యాంక్ బ్యాలెన్స్‌ పెంచుకుంటున్నాడట మాస్ మహారాజ్. రెమ్యూనరేషన్‌ భారీగా డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటివరకు 7 నుంచి 8 కోట్లు తీసుకున్న రవితేజ, ఇప్పుడు 16 కోట్లు డిమాండ్‌ చేస్తున్నాడట.

రవితేజ ఇప్పుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి రవితేజ 16 కోట్ల వరకు తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ‘క్రాక్’ సినిమాకి రవితేజ 7 కోట్ల వరకు తీసుకుంటే బడ్జెట్ 20 కోట్ల వరకు అయ్యిందట. మరి ఇప్పుడు రెమ్యూనరేషనే 16 కోట్లు తీసుకుంటే బడ్జెట్ 40 కోట్ల వరకు పెరిగే అవకాశముంది. సో నిర్మాత సేఫ్ అవ్వాలంటే రవితేజ మార్కెట్ 50 కోట్లకి రీచ్ అవ్వాలి. మరి మాస్ మహారాజ్‌ హాఫ్‌ బిలియనీర్‌గా మారతాడా లేదా అన్నది బిగ్‌ క్వశ్చన్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news