గుంటూరు మాజీ ఎంపీ రాయపాటికి తీవ్ర అస్వస్థత

-

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం ఆయనకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ప్రస్తుతం సాంబశివరావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా సాంబశివరావు లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందు నుంచీ హైదరాబాద్‌ లోని ఆయన నివాసంలోనే ఉంటున్నారు. రాయపాటి అస్వస్థతకు గురయ్యారని తెలియడంతో టీడీపీ ముఖ్యనేతలు కుటుంబ సభ్యులకి ఫోన్‌ చేసి పరామర్శించారు.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

rayapati sambasiva rao praises ap cm ys jagan administration

అయితే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థ‌  బ్యాంకుల నుంచి ‌తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసు పేరు చెప్పి ఆయన్ను బెదిరించి డబ్బు దోచుకోవాలని చూసిన వ్యవహారంలో మలయాళ నటి మరియాపాల్, ఆమె ప్రియుడు సుఖేశ్ చంద్రశేఖర్‌ లను సీబీఐ అధికారులు గుర్తించారు. వీరి వెనకాల ఎవరన్నా ఉన్నారా అనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news