రాజకీయాల్లో ట్విస్ట్‌లు కామన్. నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. ఏ నాయకుడికి జై కొడతారో చెప్పలే ని పరిస్థితి రాత్రికి రాత్రి బిషాణా ఎత్తేసిన నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి పార్టీ మార్పు.. అనేది అందరికీ కామన్. దీనిపై పెద్దగా ఇప్పుడున్న రాజకీయాల్లో ఎవరూ దృష్టి పెట్టడం లేదు. అయితే, ఈ మార్పులోనే ట్వి స్ట్ ఇచ్చే రాజకీయాలు కూడా ఉంటాయా ? అంటే..తాజాగా గుంటూరుకు చెందిన కీలక రాజకీయ కురువృద్ధు డు రాయపాటి సాంబశివరావు చేస్తున్న రాజకీయ వ్యూహం అందరికీ మతి పోగొడుతోంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన అనేక రాజకీయాలు చవిచూశారు. అనేక మంది నేతల వ్యూహాలను వడబోశారు.
ఈ క్రమంలోనే ఆయన కూడా ఈ వ్యూహాలకు మరింత సానబట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో నరసరావు పేట పా ర్లమెంటు స్థానం నుంచి ఓడిపోయారు. మరోపక్క, పార్టీ కూడా చిత్తుగా ఓడిపోయి.. ప్రతిపక్షంలో కూర్చుంది. దీంతో ఇక, పార్టీలో ఉండి చేసేదిఏంటి? అనే ప్రశ్న సహజంగానే రాయపాటిని తొలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల వరకు ఆయన జాతీయ పార్టీ బీజేపీలోకి చేరిపోతారని పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి. అయితే, పార్టీ మార్పు ఖాయమని ఆయన ఒప్పుకొన్నా.. ఏ పార్టీ అనేది మాత్రం వెల్లడించలేదు.
అయితే, తాజాగా మాత్రం.. ఆయన వైసీపీకి అనుకూలంగా మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ పాలన బాగోలేదని ఒకపక్క టీడీపీ చెబుతుంటే.. మరోపక్క అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జగన్ పాలనకు మంచి మార్కులు వేయడంతో ఆయన పార్టీ మారుడు ఖాయమని తేలిపోయింది. అయితే, ఇంతకు ముందు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన బీజేపీలోకి వెళ్తారని అనుకున్నా.. ఇప్పుడు రాయపాటి వ్యూహం మార్చుకున్నారనేది స్పష్టమైంది. నేరుగా బీజేపీలోకి వెళ్తే.. ఆయనకు ఒనగూరే ప్రయోజనాల కన్నా.. వైసీపీలోకి వచ్చి.. బీజేపీవైపు మధ్యవర్తిగా ఉంటే.. ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి.
రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకులు ఎవరూ కూడా వైసీపీతో విభేదించడం లేదు. కేంద్రంలోని పెద్దలు జగన్‌ను పొడుగుతూనే ఉన్నారు. అదేసమయంలో చంద్రబాబుపై కారాలు మిరియాలు నూరుతున్నారు. బాబు తప్పు చేశాడని అంటున్నారు. మోడీని, బీజేపీని తిట్టి ఆయన మహాపాపం చేశారని అంటున్నారు. ఈ క్రమంలో రాయపాటి అదిరిపోయే వ్యూహంతో అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. వైసీపీలో చేరడం ద్వారా.. అటు బీజేపీతోనూ చెలిమి చేసి.. రాష్ట్రంలో బీజేపీ, వైసీపీల మైత్రికి తాను కృషి చేస్తానని వచ్చే ఎన్నికల నాటికి మిత్రం పక్షం ఎన్నికలకు వెళ్లేలా చూస్తానని ఆయన హామీ ఇవ్వడం ద్వారా కేంద్రంలోనూ ఆయన చక్రం తిప్పేందుకు అవకాశం ఉంటుంది.
ఇటు, వైసీపీలోనూ కీలక నాయకుడిగా ఎదిగేందుకు చాన్స్ ఉంటుంది. వచ్చే ఎన్నికల తర్వాత కుదిరితే తన కుమారుడికి .. వైసీపీ గెలిస్తే.. మంత్రి పదవిని ఇప్పించుకునే అవకాశం ఉంటుంది. లేదా తన కలను నెరవేర్చుకునేలా టీటీడీ చైర్మన్ గిరీని పొందేందుకు జగన్ నుంచి గట్టి హామీని సైతం పొందేందుకు వీలు ఉంటుంది. ఇలా అన్ని పక్కలా పదునైన రాజకీయాలు చేసేందుకు రాయపాటికి అవకాశం చిక్కుతుంది. ఈ క్రమంలోనే ఆయన తాజాగా వైసీపీకి అనుకూల వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.