ఆ బ్యాంకులో విత్ డ్రా లిమిట్ తగ్గించిన ఆర్బిఐ…!

-

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్ధిక లావాదేవీల విషయంలో సరికొత్త నిబంధనలు ప్రవేశ పెడుతుంది. ప్రతీ బ్యాంకు మీద దృష్టి పెట్టింది ఆర్బిఐ. తాజాగా ఒక బ్యాంకు విషయంలో ఆర్బిఐ కీలక నిర్ణయం తీసుకుంది. కర్నాటకలోని బెంగళూరులో ఉన్న శ్రీ గురురాఘవేంద్ర సహకార బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. ఆ బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారి చేసింది.

రుణాలు ఇవ్వకూడదని, అలాగే వాటిని రెన్యూవల్ కూడా చేయొద్దని ఆదేశించింది. పెట్టుబడులు పెట్టవద్దని, రుణాలు తీసుకోవద్దని, డిపాజిట్లు స్వీకరించొద్దని స్పష్టం చేసింది. బ్యాంక్ ఏ విధమైన చెల్లింపులు చేయవద్దని ఆర్‌బీఐ స్పష్ట౦ చేసింది. ఒప్పందాలు కుదుర్చుకోవడం, ప్రాపర్టీ లేదా ఇతర ఆస్తులకు ట్రాన్స్‌ఫర్ చేయడం లేదంటే విక్రయించడం వంటివి చేయకూడదని, అప్పులను తగ్గించుకోవడానికి చెల్లింపుకు చేయొద్దని చెప్పింది.

ఆర్బిఐ ఆంక్షలతో ఇప్పుడు ఖాతాదారులపై కూడా ప్రభావం పడింది. ఆ బ్యాంక్ నుంచి రూ.35,000కు మించి డబ్బు విత్‌డ్రా చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారి చేసింది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఇతర డిపాజిట్ అకౌంట్లకు ఇది వర్తిస్తుందని చెప్పింది. బ్యాంక్ ఆర్థిక పనితీరు మెరుగుపడేంత వరకు ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. జనవరి 10 నుంచి ఆర్‌బీఐ ఆంక్షలు ఆరు నెలల పాలు అమలులో ఉంటాయంది.

అవసరం అనుకుంటే మాత్రం వాటిని తగ్గిస్తుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35ఏలోని సబ్ సెక్షన్ 1 ప్రకారం ఆర్‌బీఐ ఈ ఆంక్షలు విధించింది. గురురాఘవేంద్ర బ్యాంక్ అధికారాలను దుర్వినియోగం చేయడంతో జనవరి 2న ఈ నిర్ణయంకి సంబంధించి లేఖ రాసిది. బ్యాంక్ డిపాజిటర్లు భయపడాల్సిన అవసరం లేదని, మీ డబ్బుకు పూర్తి భద్రత ఉంటుందని బ్యాంక్ చైర్మన్ కె.రామకృష్ణ హామి ఇచ్చారు. డబ్బులు 100 శాతం సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news