కరెన్సీ నోట్లపై గాంధీ ఫోటో ఉండాలా? వద్దా?.. క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ

-

ఇటీవల కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ఫోటోను మార్చి.. కొత్త నోట్లను ముద్రించనున్నారంటూ ప్రచారం వినిపిస్తోంది. ఈ వార్తను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఖండించింది. కరెన్సీ నోట్లపై గాంధీ ఫోటోను మార్చే ప్రతిపాదన లేదని తేల్చి చెప్పింది. కాగా, ఇటీవల కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోకు బదులు అబ్దుల్ కలాం, రబీంద్రనాథ్ ఠాగూర్ వంటి ప్రముఖుల ఫోటోలతో కొత్త నోట్లను తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కొత్త నోట్లకు సంబంధించిన డిజైన్లు, ప్రణాళికలు కూడా పూర్తయినట్లు పేర్కొన్నాయి.

గాంధీ-కరెన్సీ నోట్లు
గాంధీ-కరెన్సీ నోట్లు

దీంతో ఈ వార్త వైరల్ అయింది. దీనిపై స్పందించిన ఆర్‌బీఐ.. ఈ వార్తను కొట్టిపారేసింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న కరెన్సీ నోట్లకు మార్పు చేస్తున్నామని, గాంధీ ఫోటోకు బదులు ఇతర ప్రముఖుల ఫోటోలు ముద్రిస్తున్నామని వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొంది. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనే లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news