బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మను వెంటనే అరెస్ట్ చేయాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ముస్లిం మత పెద్దలు, పలువురు రాజకీయ నాయకులు వ్యతిరేకించారు. ఈ మేరకు బీజేపీ కూడా పార్టీ నుంచి ఆమెను తొలగించింది. తాజాగా ఈ విషయంపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మోడీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.
కాగా, మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాల సహకార సమాఖ్య(ఓఐసీ) మండిపడింది. భారత్, మోడీ ప్రభుత్వంపై తగు చర్యలు తీసుకోవాలని ఐరాసను కోరింది. గల్ఫ్ దేశాల్లో ఈ విషయంపై పెద్ద రచ్చ నడుస్తోంది. అందుకే జాతీయ అధికార ప్రతినిధిపై బీజేపీ చర్యలు తీసుకుందని పేర్కొంది. నూపుర్ శర్మను పది రోజుల క్రితమే సప్పెండ్ చేసి ఉండాలని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు మౌనంగా ఎందుకు ఉన్నాయనే విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. వెంటనే నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.