ఆర్బీఐ కీలక నిర్ణయం.. వాళ్ళకి టెన్షన్ లేనట్టే !

-

ఆర్బీఐ గవర్నర్ కొద్ది సేపట క్రితమే విధాన నిర్ణయాలను ప్రకటించారు. ద్రవ్యోల్బణంపై ఆందోళనల దృష్ట్యా కీలక రేట్లను ఆర్బీఐ యథాతథంగానే ఉంచారు. రెండ్రోజులపాటు సమావేశమైన ఆర్బీఐ పరపతి విధాన కమిటీ తాజా పరిణామాలపై చర్చించింది. ఈ సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథావిథిగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ ఈ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం 4 శాతం ఉన్న రెపో రేటు, వడ్డీ రేట్లు యధాతదంగా ఉండనున్నాయి. రెపో రేటు, రివర్స్ రెపో రేటు విషయంలో కూడా ఆర్బీఐ మార్పులు చేయలేదు.

ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారికి కొంత ఊరట కలిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వడ్డీ రేట్ల తగ్గుదల ఉండదు కాబట్టి, అలానే డిసెంబర్ నుండి 24 గంటల పాటు ఆర్టీజీఎస్ సర్వీసులు ఉండనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. గత పరపతి సమీక్షల తరువాత కీలక రేట్లను తగ్గించామని గుర్తు చేసిన శక్తికాంత దాస్, భారత రియల్ జీడీపీ 9.5 శాతం వరకూ తగ్గుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో స్వల్ప రికవరీ నమోదైందని, ఇది రెండో భాగంలో మరింతగా నమోదవుతుందని, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభంకావడం శుభసూచకమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news