RC 15 : “గేమ్ చేంజర్” గా వస్తున్న రాంచరణ్.. ఇక మెగా ఫ్యాన్స్ కు పండగే

-

ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య ఫ్లాప్ అవడంతో చరణ్ నుంచి సాలిడ్ హిట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 

 

ఈ క్రమంలోనే సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్తో ఆర్సి15 మూవీ తెరకెక్కిస్తున్నారు. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్, కియారా అద్వానీ జోడీగా నటిస్తున్న RC15 మూవీకి ‘CEO’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు  వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ను చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు గేమ్ చేంజర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసింది చిత్రం బృందం. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేశారు మేకర్స్.   ఇందులో చెర్రీ ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెజార్టీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, SJ సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news