తినే ముందు చదవండి: ప్యాక్ వెనుక వుండే ప్రోడక్ట్ లేబుల్స్ అసలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి..!

-

సాధారణంగా మనం ఏదైనా ప్రొడక్ట్స్ గమనిస్తే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. కొన్ని ప్రొడక్ట్స్ పై మంచి లాభాలు కలగాలని కంపెనీ అడ్వర్టైజ్మెంట్లని ఆ విధంగా రూపొందించుకోవడం జరుగుతుంది. కనుక ఎప్పుడైనా ఏదైనా తినేటప్పుడు వెనుక ఉండే న్యూట్రిషన్ చార్ట్ మరియు పదార్థాలని చూడండి. దీనితో మీకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి.

కాంప్లయిన్ కంపెనీ అడ్వటైజ్మెంట్ చూసినట్లయితే రెండు రెట్లు వేగంగా ఎత్తు ఎదగవచ్చని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అయితే నిజానికి అది కేవలం అడ్వటైజ్మెంట్ వరకు మాత్రమే. దీనిలో ఎటువంటి నిజం ఉండదు.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ 2012లో కాంప్లయిన్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలానే 2010లో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఛార్జ్ షీట్ ని ఫైల్ చేసింది.

ఎక్కువ స్టేమినా:

అదే విధంగా హార్లిక్స్ మరియు బూస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూసినట్లయితే స్టామినా ఎక్కువగా పొందొచ్చని ఉంటుంది. దీని గురించి కూడా ఎటువంటి ప్రూఫ్ లేదు. అయితే ఎక్కువగా వీటిల్లో పంచదార మరియు మాల్ట్ ఉంటుంది.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మనం కేవలం ఆరు టీ స్పూన్ల పంచదారని మాత్రమే రోజుకి తీసుకోవాలి. దాని కంటే ఎక్కువ పంచదారను తీసుకోవడం వల్ల అది కొవ్వు కింద మారిపోతుంది. దీనితో ఒబిసిటీ వస్తుంది.

షుగర్, మైదా లేదు:

అదే విధంగా బలం కొన్ని ప్రొడక్ట్స్ చూసినట్లయితే నో షుగర్.. నో మైదా అని రాస్తారు. అటువంటి ప్రోడక్ట్స్ ప్యాక్ ని మనం చూసినట్లయితే… తేనె లేదా మాల్ట్ లాంటి వాటిని ఉపయోగిస్తారు. అంటే షుగర్ లేదు అంటే నిజంగా షుగర్ లేదు అని కాదు. కచ్చితంగా షుగర్ కేలరీలు వాటిలో ఉంటాయి ఈసారి చూడండి.

light or lite:

మనం ఏవైనా నూనె అడ్వర్టైజ్మెంట్ చూసినట్లయితే లైట్ గా ఉంటుంది అని చెప్తారు. 2012లో saffola ఆయిల్ ఆరోగ్యానికి చాలా మేలు అని అంది. కానీ దీనికి సంబంధించి ఎటువంటి ప్రూఫ్ లేదు. ఇలా కేవలం అడ్వర్టైజ్మెంట్ లో మాత్రమే చెబుతారు.

నిజమైన పండ్లతో తయారు చేయడం:

కొన్ని కొన్ని జ్యూస్లు వంటివి వాటి మీద మనం చూసినట్లయితే.. దానిలో రియల్ ఫ్రూట్స్ ని ఉపయోగిస్తామని ఉంటుంది. కానీ నిజం నిజమైన పండ్లని కొద్ది శాతం మాత్రమే ఉపయోగిస్తారు. ఇలా చాలా ప్రొడక్ట్స్ మీద ఇలాంటివి రాసి ఉంటాయి. కనుక ప్యాక్ వెనుక వుండే ప్రోడక్ట్ లేబుల్స్ ని న్యూట్రిషన్ చార్ట్ ని చూసి అప్పుడే కొనండి.

Read more RELATED
Recommended to you

Latest news